బలహీనపడిన అల్పపీడనం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీన పడింది. పది రోజుల పాటు వాతావరణ నిపుణుల అంచనాలకు అందకుండా సముద్రంలో ప్రయాణించింది. ఎట్టకేలకు అల్పపీడనం బలహీన పడటంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.