HealthHome Page SliderInternational

పసిపిల్లల విషయంలో తల్లులకు హెచ్చరిక

చిన్నపిల్లలు, పసిపిల్లల విషయంలో ఇలాంటి పనులు చేయవద్దని తల్లులకు వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు. అదేంటంటే చిన్నపిల్లలు తరచూ ఇన్ఫెక్షన్లు, అలర్జీ, జ్వరాలతో బాధపడుతుంటారు. వారి విషయంలో ఎలాంటి అజాగ్రత్త, ఇష్టారాజ్యంగా మందులు వాడడం తగని పని అని హెచ్చరిస్తున్నారు. కడుపునొప్పి, జ్వరం, జలుబు వంటి మందులను గతంలో ఇదే మందు వాడాం కదా అనుకుంటూ డాక్టర్ సలహా లేకుండా వాడొద్దంటున్నారు. మెడికల్ షాపుకు వెళ్లి మందులు తెచ్చేసి, సొంతవైద్యాలు చేయొద్దని అలా చేస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ మందులు అత్యంత శక్తివంతమైనవని, వాటిని వైద్య సలహా లేకుండా వినియోగిస్తే ప్రమాదం తప్పదని పేర్కొన్నారు. బాల్యంలో యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడితే ఉబ్బసం ముప్పు పెరుగుతుందని, దాని ప్రభావం భవిష్యత్ జీవితంపై తీవ్రంగా ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో తేలింది.