Home Page SliderTelangana

జడ్పీటీసీ కందుల సంద్యారాణికి బీజేపీలో ఘనస్వాగతం

పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణిని భారతీయ జనతా పార్టీలోకి మనఃస్పూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జడ్పీటసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, వారి అనుచరులు, పెద్దపల్లి, రామగుండంకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు. రానున్న ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ కేవలం డబ్బులపై ఆధారపడిందని, అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. నెరవేర్చిన హామీలు ఏంటనేవి ప్రజలకు వివరించి ఎన్నికలకు రావాలని, ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.

పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ, రుణమాఫీ, దళిత బంధు, గిరిజన బంధు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలను నెరవేర్చకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహిళా పొదుపు సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పైసలు చెల్లించడం లేదని, ఆరోగ్య శ్రీ అటకెక్కించారని విమర్శించారు. వైద్య, వైద్య రంగానికి బడ్జెట్ లో నిధులను తగ్గించారని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో యువత, ప్రజలు నిశ్శబ్ధ వాతావరణంలో రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారన్నారు. తమ నిర్లక్ష్యం, అసమర్థతతో ఉద్యోగాలు భర్తీ చేయకుండా, పేపర్ లీకేజీలకు కారణమై యువత, నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ అని కిషన్ రెడ్జడి దుయ్యబట్టారు.

పాలకుర్తి జడ్పీటసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లో మంచిపేరు సంపాదించుకున్నారన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమె పోరాటం చేశారన్నారు. సంధ్యారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదమవుతుందన్నారు.

భారతీయ జనతా పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు జడ్పీటీసీ కందుల సంధ్యారాణి. తెలంగాణకు పట్టిన గ్రహణం వీడాలంటే, సుపరిపాలన అందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రజలు నిశ్శబ్ధ వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి, పూలే ఆశయాల సాధన దిశగా ముందుకెళ్తానన్నారు. భారతీయ జనతా పార్టీతోనే అన్ని వర్గాలకు ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టం తీసుకొచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మహిళలంతా మద్దతు తెలపాలని కోరుతున్నానని ఆమె చెప్పారు.