గయానాలో మోదీకి ఘనస్వాగతం
పశ్చిమ ప్రపంచ దేశాల పర్యటలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం గయానాలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ నేతృత్వంలోని బృదం మోదీకి ఘనస్వాగతం పలికింది. గయానా సాంప్రదాయ నృత్య కళాకారులు,మేళతాళాల నడుమ మోదీ అపూర్వ స్వాగతం అందుకున్నారు. 58 ఏళ్ల సుదీర్ఘ విరామానాంతరం గయానాలో పర్యటించిన తొలి ప్రధాన మంత్రిగా మోదీ రికార్డు సృష్టించారు.ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో భారత రాయబారుల కరచాలన అనంతరం …అక్కడ ప్రవాస భారతీయులతో కొద్ది సేపు ముచ్చటించారు.అనంతరం అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీతో భేటీ అయ్యారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.రక్షణ,ఆరోగ్యం, పునరుత్పాదక శక్తి వనరుల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.పలు ఎంవోయులపై సంతకాలు చేశారు.