కాంగ్రెస్ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్
ఎమ్మెల్యేల ద్వారా ఎంపిక చేసే ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకొంది. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించడం విషయంలో గందరగోళం నెలకొన్నట్టుగా కన్పిస్తోంది. ముందుగా అనుకున్నట్టుగా కాకుండా అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ముందుగా ప్రకటించినట్టుగా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను పార్టీ ఎంపిక చేసింది. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఖరారు అంటూ ప్రచారం జరిగింది. అయితే పార్టీ తాజాగా ఈ నిర్ణయం తీసుకొంది.

