Home Page SliderNational

పెళ్లివారి కోసం వేచి ఉన్న రైలు

ముంబయి నుండి హావ్‌డా వెళ్లవలసిన గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో వారు ప్రయాణిస్తున్నారు. అయితే ఆ రైలు శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు చేరుకోవలసి ఉండగా, ఆలస్యం అయ్యింది. సాయంత్రం 4 గంటలకు వారు హావ్‌డా- గువాహటి సరాయ్ ఘాట్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లవలసి ఉంది. ఈ రైలు ఆలస్యం కావడంతో వారి కోసం హావ్‌డా- గువాహటి సరాయ్ ఘాట్ ఎక్స్‌ప్రెస్‌ను కొన్ని నిమిషాల సేపు నిలిపి వేశారు. వీరు ఆ రైలును అందుకోలేమని భావించి, రైల్వే వర్గాలకు ట్వీట్ చేయగా, వారి అభ్యర్థన మన్నించి రైలును కాసేపు నిలిపివేయడమే కాకుండా, 24 వఫ్లాట్‌ఫామ్‌పై దిగిన వారిని, 9 వ నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌కు బ్యాటరీ వ్యాన్‌లో రైల్వే అధికారులే తరలించారు. ఇంతటి సహాయం చేసినందుకు వారంతా రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ రంగంలోని ఇలాంటి సర్వీసు అందించడం చాలా అరుదని కొనియాడారు. దీనితో ఇలాంటి సేవలు అందించడం తమ నైతిక బాధ్యతగా భావిస్తున్నామని రైల్వే తెలిపింది.