విడాకులిచ్చినా అండగా నిలిచిన టాప్ మ్యూజిక్ డైరక్టర్
ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్, ఆస్కార్ విజేత రెహమాన్ తన భార్య సైరాకు ఇటీవల విడాకులు మంజూరైన సంగతి తెలిసిందే. అయితే వారు విడాకులు తీసుకున్నా సరే రెహమాన్ తన భర్తగా తన బాధ్యతను నెరవేర్చారు. తన మాజీ సతీమణి సైరాకు మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా సర్జరీ చేయవలసి వస్తే, ఆ క్లిష్ట సమయంలో ఆమెకు అండగా నిలిచారు. బాధ్యతగా దగ్గరుండి సపర్యలు చేశారు. ఈ విషయంలో ఆమె తనకు సపోర్టుగా నిలిచినందుకు రెహమాన్‌కు, ఇతర ఆత్మీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే ఏ.ఆర్.రెహమాన్, సైరా బాను 29 ఏళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత విడిపోయారు. విడాకుల వెనుక మానసిక ఒత్తిడి కారణమని సైరా పేర్కొంది. ఆ ఒత్తిడి దంపతుల మధ్య పూడ్చలేని గ్యాప్‌కు దారితీసింది. సైరా హెల్త్ అప్‌డేట్ గురించి వారికి విడాకులకు సహాయపడిన లాయర్ వందనా షా మీడియాకు వెల్లడించారు.