జానీ మాస్టర్ చుట్టూ బిగిసిన ఉచ్చు..
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగికవేధింపుల ఫిర్యాదు అందడంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు పోలీసులు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తాను మైనర్‌గా ఉండగానే, ఐదేళ్లుగా తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, ముంబయి తీసుకెళ్లి అత్యాచారం చేశారని చెప్పడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాడని సమాచారం రావడంతో పోలీసులు, అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరిపారని సమాచారం. అతడికి నోటీసులిచ్చి విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితురాలి స్టేట్‌మెంటును రికార్డు చేశారు నార్సింగి పోలీసులు. నేడు బాధితురాలి ఇంటికి వెళ్లి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. ఈ కేసులో ఆమెకు వైద్యపరీక్షలకు కూడా సిఫారసు చేశారు. ఈ కేసుపై బాధితురాలికి అండగా నిలిచారు సినీపరిశ్రమ పెద్దలు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను మతం కూడా మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడని సమాచారం. ఇప్పటికే ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఆమెకు మద్దతు ప్రకటించారు. తన రాబోయే చిత్రాలలో ఆమెకు కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. పుష్ప చిత్రంలో కూడా ఆమె పని చేస్తున్నట్లు సమాచారం.