Breaking NewsHome Page SliderInternationalNationalSpiritual

మూడు జ‌న్మ‌లెత్తితేనే …మ‌ళ్లీ ఆ భాగ్యం క‌లిగేది

భార‌త దేశం మొత్తం జ‌నాభాలో మూడో వంతు ప్ర‌జ‌లు కుంభ‌మేళాకు హాజ‌ర‌య్యారు.చిన్నారులు,అతి వ‌యో వృద్దుల‌ను మిన‌హాయిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు 38 కోట్ల మంది భ‌క్తులు ప్ర‌యాగ్ రాజ్ కు త‌ర‌లి వ‌చ్చారు.ఇది దేశ జ‌నాభాలో మూడో వంతు కంటే అధిక‌మ‌నే చెప్పాలి.పుణ్య స్నానాలు,అమృత స్నానాలు ఆచ‌రించేందుకు భ‌క్తులు తిథుల వారీగా త‌ర‌లి వ‌చ్చారు.ఇది గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డులో చోటు సంపాదించింది.అదేవిధంగా ఇండియా బుక్ తో పాటు మ‌రిన్ని రికార్డుల‌కెక్కింది.అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు,ప‌లువురు శాస్త్ర‌వేత్త‌లు దీన్నొక కేస్ స్ట‌డీగా భావించాని ప్ర‌పంచానికి సూచించారు.కాగా ఈ నెల 26తో మ‌హా కుంభ‌మేళా దివ్య‌మైన వేడుక‌లు ముగియ‌నున్నాయి.144 ఏళ్ళ‌కొక‌సారి వ‌చ్చే కుంభ్ కావ‌డంతో ఇలాంటి వైభ‌వోపేత‌మైన చారిత్రాత్మ‌క ఉత్స‌వాలు చూడాలంటే మ‌నిషి క‌నీసం వరుస‌గా మూడు జ‌న్మ‌లెత్తాల్సి ఉంటుంది.