Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

ఓటుకు నోటు దొంగకు మాట్లాడే అర్హతే లేదు

రాష్ట్ర జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది. కోస్గి సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలకు కేటీఆర్ ‘ఎక్స్ ‘ వేదికగా బుధవారం సమాధానమిచ్చారు.పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి, సొంత జిల్లాకే దగా చేస్తూ అహంకారంతో దగుల్బాజీ కూతలు కూస్తున్నావని మండిపడ్డారు. తెలంగాణ సోయి లేని రేవంత్ ఒక ‘కోవర్ట్’ అని, ‘ఓటుకు నోటు’ కేసులో పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగవు నీకేం స్థాయి ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సభ్యత, సంస్కారం లేని నీచమైన వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నారని, పనికిమాలిన శపథాలు చేసి పారిపోవడం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము ఆత్మగౌరవం లేని దిల్లీ బానిసలం కాదని, రైతన్నల హక్కుల కోసం భగ్గున మండుతామని స్పష్టం చేశారు. తిట్లు, బూతులతో ప్రజలను డైవర్ట్ చేసే డ్రామాలు సాగవని, 2028లో కాంగ్రెస్‌ను ప్రజలు బొందపెట్టడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.