బంగారం షాపులో తుపాకీతో బెదిరించిన దొంగ
కాకినాడలో పట్టపగలే ఒక దొంగ బంగారం షాపులో చొరబడ్డాడు. తుపాకీతో బెదిరించి, ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. షాపువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అటవీశాఖ కార్యాలయం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగ వద్ద గల తుపాకీ డమ్మీదని పోలీసులు తేల్చారు. అతడి నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

