ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మంది సజీవ దహనం
సౌత్ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టబాస్కో రాష్ట్రంలో 48 మందితో ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. స్పాట్ లో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవ శేషాలను గుర్తించినట్లు స్థానిక అధికారి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.