నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం
ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేశాడు. యువతి ఆటోలో వెళ్తుండగా.. బయటకు లాగి మరీ ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. భయభ్రాంతులకు గురైన యువతి ఒక్కసారిగా కేకలు వేసింది. బాధితురాలు ఒక్కపెట్టున కేకలు వేయడంతో యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను దగ్గరలోని హస్పటల్‌కు తరలించారు. ఈ అమానవీయ ఘటన కొడవలూరు మండలం నార్త్‌రాజు పాలెంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు లెంగుంటపాడుకు చెందిన సురేష్‌గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం జైలుకు తరలించారు. అయితే గాయపడ్డ యువతి వివాహిత అని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తెలిపారు.

