ఘోర అగ్ని ప్రమాదం.. 10 పసి ప్రాణాలు ఆహుతి
ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది శిశువులు అగ్నికి ఆహుతి అయిన దుర్ఘటన యూపీలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ లక్ష్మీబాయి మెడికల్ కాలేజిలో ఘోరమైన ప్రమాదం జరిగింది. పసిపిల్లలు ఉండే వార్డులో హఠాత్తుగా మంటలు అంటుకోవడంతో ఈ దారుణం జరిగింది. శిశువులు సజీవ దహనం కావడంతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆసుపత్రి యాజమాన్యంపై ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిలండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాధమికంగా కనుగొన్నారు. తీవ్ర గాయాలతో 16 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. 37 మందిని రెస్క్యూ టీం కాపాడగా, మరో 50 మంది పిల్లలు వార్డుల్లో ఉన్నారని, వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఘటనాస్థిలికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.