Home Page SliderInternational

అమెరికాలో ఘోర ప్రమాదం.. బిల్డింగ్ రూఫ్ టాప్ పై కూలిన విమానం

ఇటీవల దక్షిణకొరియా, కజకిస్తాన్ లలో వరుసగా జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలను మరువక ముందే అమెరికాలో మరో ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఒక చిన్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఓ భవనం రూఫ్ టాప్ పై విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫుల్లెర్టోన్ లోని ఆరెంజ్ కౌంటీ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం 2.09 గంటల సమయంలో ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. విమానం కూలిన చోట భారీగా మంటలు ఎగసిపడ్డాయని, దట్టమైన పొగ ఆవరించిందని, సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. భద్రత నిమిత్తం చుట్టుపక్కల భవనాల్లో జనాలను ఖాళీ చేయించారు. విమానం కూలిన బిల్డింగ్ కొంతమేర దెబ్బతిన్నదని పోలీసులు పేర్కొన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే కూలిపోయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ‘ఫ్లైట్అవేర్’ గుర్తించింది.

Breaking news: కోతుల‌కు భ‌య‌ప‌డి బిల్డింగ్ మీద నుంచి దూకేశాడు