Home Page SliderInternational

ఘోర ప్రమాదం.. 25 మంది చిన్నారులు సజీవ దహనం

స్కూల్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగింది. అయుత్తయ స్కూల్ పిల్లలు, సిబ్బంది విహార యాత్రకు వెళ్లి పతుంథాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుండగా.. ఉతయ్ థాని ప్రావిన్స్ వద్ద స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మొత్తం 44 మంది ఉండగా.. 25 మంది మరణించినట్లు ఆ దేశ మీడియా వర్గాలు తెలిపాయి. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమవ్వగా మృతదేహాలు బస్సులోనే కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.