అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో తెలుగు కుటుంబం మృతి
అమెరికాలోని టెక్సాస్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగువారు మరణించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమలాపురం వాసులుగా గుర్తించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులని సమాచారం. ఎమ్మెల్యే చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య, కుమార్తె, మనవడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. నాగేశ్వరరావు అల్లుడికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా క్రిస్మస్ సందర్భంగా టెక్సాస్ నుండి అట్లాంటా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం.

