Home Page SliderNational

యూట్యూబ్ ద్వారా 200 మందిని మోసం చేసిన టీనేజర్

రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 11 వతరగతి విద్యార్థి యూట్యూబ్ ద్వారా 200 మందిని మోసం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాసిఫ్ మిశ్రా అనే 19 ఏళ్ల పిల్లవాడు ఆన్‌లైన్‌లో నకిలీ పెట్టుబడి పథకం కింద దాదాపు రూ.42 లక్షలు కాజేశాడు. ఈ అబ్బాయికి ఇన్‌స్టా ఖాతాలో లక్షలాది మంది ఫాలోవర్లు కలిగి ఉండడం విశేషం. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి ఎక్కువ డబ్బు ఇస్తూ నమ్మకం కలిగించాడు. రూ.99,999 పెట్టుబడి పెడితే కేవలం 13 నెలల్లోనే రూ.13,99,999 వస్తుందని మభ్యపెట్టాడు. కొందరు అతని మాటలు నమ్మి పెట్టుబడి పెట్టారు. చివరికి మోసం తెలుసుకుని పోలీసులు ఫిర్యాదు చేశారు. అతడి ఇంటిపై దాడి చేసిన పోలీసులకు కరెన్సీ కౌంటింగ్ మెషిన్ కనిపించడంతో కంగుతిన్నారు. అతని కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.