Home Page SliderTelangana

ఒక్క స్టూడెంట్ కోసమే ఆ పాఠశాలలో ఓ టీచర్ బోధన

ఓ ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం ఏడాదికి ఏకంగా రూ. 12.84 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇది ఎక్కడో కాదు మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల. స్కూల్ మొత్తంగా ఒకే ఒక్క విద్యార్థిని కీర్తన 4వ తరగతి చదువుతోంది. ఒకే స్టూడెంట్ ఉన్న ఈ స్కూల్ లో ఒక టీచర్ పని చేస్తుండగా జీతం రూపంలో ఏడాదికి రూ.12 లక్షల వరకు ఖర్చవుతోంది. అలాగే వంట మనిషి, పారిశుధ్య కార్మికురాలు ఒక్కొక్కరికి నెలకు రూ. 3వేల చొప్పున ప్రభుత్వం ఏడాదికి మరో రూ. 60 వేలు చెల్లిస్తోంది. ఒక్కరి కోసమే మధ్యాహ్న భోజనం వండుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా నిర్వహణ గ్రాంట్ కింద రూ.5000, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో రూ. 5000 మంజూరు చేస్తున్నది. అన్నీ కలిపి ఒక్క విద్యార్థినిపై ప్రభుత్వం విద్యా సంవత్సరం సుమారు రూ. 12.84 లక్షల ఖర్చు చేస్తోంది. అయితే ఆ గ్రామంలో మిగతా తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను వైరా, తల్లాడలోని ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నట్టు తెలిసింది.