Andhra PradeshHome Page Slider

విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

తనకల్లు: ఓ టీచర్ విద్యార్థినిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె బిడ్డకుజన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జరిగింది. నియోజకవర్గానికి చెందిన బాలిక (16) తొమ్మిది నెలల క్రితం ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతుండగా నీళ్లు తాగేందుకని స్టాఫ్ రూమ్‌లోకి వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న టీచర్ రెడ్డి నాగయ్య అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో విద్యార్థిని మిన్నకుండిపోయింది. ఇదే అదనుగా భావించిన టీచర్ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. శనివారం బాలికకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలికి రక్తం తక్కువ ఉండడంతో డాక్టర్లు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించాలని సూచించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఔట్‌పోస్టు పోలీసుల ద్వారా ఎస్‌ఐ రాజశేఖర్ విషయం తెలసింది. ఈ నేపథ్యంలో టీచర్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కదిరి డీఎస్పీ శ్రీలత అనంతపురం ఆసుపత్రిలో బాలికను పరామర్శించిన అనంతరం వివరాలు వెల్లడించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.