ఫ్రాన్స్‌లో సంపన్నులపై టాక్స్ మోత
ఫ్రాన్స్‌లో త్వరలోనే లెఫ్ట్ వింగ్‌కు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీ ఫ్రాన్స్‌లో అమలు చేయనున్న పాలసీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఫ్రాన్స్‌లో న్యూ పాపులర్ పార్టీ అధికారంలోకి వస్తే 4 లక్షల యూరోల (₹3.6 కోట్లు) కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారిపై 90% ట్యాక్స్ విధిస్తామని కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ దేశంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60కి పరిమతం చేస్తామని ఆ పార్టీ పేర్కొంది. అంతేకాకుండా ఇంధన ధరల నియంత్రణ,కనీస వేతన పెంపు మొదలైన అంశాలను కూడా న్యూ పాపులర్ పార్టీ హామీల్లో పేర్కొంది.