పుట్టెడు దుఃఖంతో పరీక్ష రాసిన విద్యార్థి..
ఓ వైపు తండ్రి మరణించగా పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ విద్యార్థి పరీక్ష రాసి వచ్చాడు. గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగ నవాయి గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కుమారుడు సమీర్ దేవరకద్ర గురుకులంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే.. అనారోగ్యంతో మహబూబ్ బాషా ఇవాళ మరణించాడు. దీంతో తండ్రి మరణించిన బాధను దిగమింగి సమీర్ పరీక్ష రాశాడు. అనంతరం తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.

