Home Page SliderTelangana

యూసఫ్‌గూడాలో ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి విద్యార్థిని మృతి

యూసఫ్‌గూడాలోని మాస్టర్స్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని యూసఫ్‌గూడా చౌరస్తాలోని మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడింది. మృతి చెందిన విద్యార్థిని మెహరీన్‌గా పోలీసులు గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.