ఒక రాష్ట్రం మంత్రిని.. దేశానికి ఉపరాష్ట్రపతిని చేశారు
ఆయ్…మాది గోదావరండి…మాకు మమకారంతో పాటు కూసింత ఎటకారమూ ఎక్కువేనండి….అంటూ కోనసీమ కుర్రోళ్లు యూ ట్యూబుల్లో అదిరిపోయే వీడియోలు చేస్తుంటారనేది మనందరికీ తెలిసిందే.కానీ అదే గోదావరి నీళ్లు తాగిన కొంత మంది కుర్రోళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా.. తెలంగాణ రాష్ట్ర మంత్రిని దేశానికి ఉపరాష్ట్రపతిని చేసేంత ఎటకారం వచ్చేస్తుంది.అవును ఏపిలోని రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు గతంలోనే తెలంగాణ సీఎం,డిసీఎంలతో సహా పలువురు మంత్రులకు ఈ వేదిక నిర్వాహకులు ఆహ్వానం అందించారు.ఇందులో భాగంగా తెలంగాణ డీసిఎంకి ఆహ్వానం పలికే ఫ్లెక్సీ బ్యానర్ లో ఆయన హోదాని భారత మాజీ ఉపరాష్ట్రపతి అంటూ తప్పుగా ముద్రించారు.దీంతో ఈ వ్యవహారంపై ఉభయ రాష్ట్రాల్లో సోషల్ మీడియా వేదికగా.. సెటైర్లు సంక్రాంతి పేలాల్లా పేలుతున్నాయి.కేటిఆర్ యూత్ ఫోర్స్,వైసీపి సోషల్ మీడియా వింగ్ వాళ్ళైతే ఈ సిచ్యుయేషన్ తో కామెంట్ల పండుగ చేసుకుంటున్నారనుకోండి.