త్రిష ఇల్లు కొన్న టాలీవుడ్ హీరో
ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మన త్రిష. వరుసగా టాప్ యాక్టర్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. వయస్సుతో సంబంధం లేకుండా, ప్రసుత్తమున్న హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా గట్టి పోటీ ఇస్తోంది ఈ అందాల భామ. ఇటీవలే పొన్నియన్ సెల్వన్, లియో సినిమాలతో హిట్స్ కొట్టింది. ప్రస్తుతం అజిత్ తో ఓ సినిమా, మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తోంది. అసలు మ్యాటర్‌కి వస్తే త్రిష ఇన్నేళ్ల తన కెరీర్‌లో కోట్లు సంపాదించింది. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరయిన్‌గా గుర్తింపు పొందింది. త్రిష ఉంటే ఇంట్లో ఇప్పుడు ఓ సీనియర్ హీరో ఉంటున్నారు. ఆయన ఎవరో కాదు ఒకప్పుడు హీరోగా నటించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంటున్న భాను చందర్. చెన్నైలో భాను చందర్ ప్రస్తుతం త్రిష నుంచి కొన్న ఇంట్లో ఉంటున్నారు. తన ఇంటిని త్రిష భానుచందర్ కు అమ్మింది. భాను చందర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ఎప్పుడైనా త్రిషని కలిస్తే, నా ఇల్లు ఎలా ఉందని ఆమె అడుగుతోంది అని చెప్తారు.