త్వరలోనే రిటైర్ కానున్న స్టార్ క్రికెటర్
డేవిడ్ వార్నర్ ఓ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినప్పటికీ తెలుగు వాళ్లకు సుపరిచితుడే. ఎందుకంటే ఆయన తన ఆటతోనే కాకుండా అప్పుడప్పుడు తెలుగు సినిమా పాటలకు స్టేప్పు లేస్తూ..వాటిని తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరితో పంచుకునేవారు.అంతేకాకుండా మన దేశంలో జరిగే ప్రతి IPL సీజన్లో డేవిడ్ వార్నర్ తన ఆటతో అదరగొడుతుంటాడు. దీంతో డేవిడ్ వార్నర్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు డేవిడ్ వార్నర్ తన రిటైర్‌మెంట్‌పై కీలక ప్రకటన చేశారు. కాగా ఆయన వచ్చే ఏడాది జనవరిలో జగరబోయే టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ కానున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులంతా షాక్ అవుతున్నారు. కాగా ఆయన త్వరలోనే తన సొంత గ్రౌండ్ సిడ్నీలో పాకిస్తాన్‌తో తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే తన చివరి టెస్ట్ మ్యాచ్ అని తెలిపారు. అయితే ప్రస్తుతం వార్నర్ WTC ఫైనల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వార్నర్ 2024 T20 వరల్డ్‌కప్ టోర్నీయే తనకు ఆస్ట్రేలియా తరపున చివరి టోర్నీ అని స్పష్టం చేశారు.