7 ఏళ్ల తర్వాత డకౌట్ అయిన స్టార్ క్రికెటర్
IPL లో భాగంగా నిన్న జరిగిన RR VS GT మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయ పతాకం ఎగురవేసిన విషయం తెలిసిందే.అయితే ఈ మ్యాచ్‌లో హెట్‌మయర్(56),సంజూ శాంసన్ (60) పరుగులు సాధించి RR విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించారు. కాగా ఈ టీమ్‌లో ఉన్న మరో స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ ఎవరు ఊహించని విధంగా GT ప్లేయర్ షమీ చేతిలో డకౌట్ అయ్యాడు. గతంలో జరిగిన 7 IPL సీజన్లలో బట్లర్ డకౌట్ కావడం ఇదే మొదటిసారి. దీంతో అటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్న స్టార్ ప్లేయర్‌ను సైతం డకౌట్ చేసిన షమీని అభినందిస్తూ..క్రికెట్ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

