Home Page SliderTelangana

ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న సాఫ్టవేర్ ఉద్యోగిని

హైదరాబాద్‌లో సనా అనే సాఫ్టవేర్ ఉద్యోగిని భర్త హేమంత్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో మాట్లాడుతూనే, ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. గత ఐదు నెలలుగా భర్త హేమంత్ అమితంగా వేధిస్తున్నాడంతూ ఏడుస్తూ వీడియోలో చెప్పుకొచ్చింది సనా. భర్త టార్చర్‌తో పాటు కుటుంబసభ్యులు కూడా ఆమె ఆవేదనకు కారణమని చెప్పింది. గతంలో భార్యాభర్తలిద్దరూ రాజస్థాన్‌లో ఉద్యోగం చేసేవారని, గొడవలతో ఈ మధ్యనే హైదరాబాద్ నాచారంకు వచ్చి ఉద్యోగం చేస్తున్నట్లు వీడియోలో  చెప్పింది సనా. ఆమెకు మూడేళ్ల చిన్న బాబు కూడా ఉన్నాడు. కొడుకుతో సంతోషంగా డాన్స్ చేస్తూ ఉండే ఆమె పరిస్థితులను ఎదుర్కొనలేక ఇలాంటి దారుణమైన నిర్ణయానికి రావడం చాలా విషాదాన్ని కలిగించిదని బంధువులు రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.