International

అమెరికా విమానంలో పాము కలకలం

మనసర్కార్

అమెరికాలోని ఒక విమానంలోని బిజినెస్ క్లాస్‌లో పాము కలకలం రేపింది. టంపా సిటీ నుండి న్యూజెర్సీకి వెళ్లే యునైటెడ్ ఫ్లైట్ 2038 విమానంలో బిజినెస్ క్లాస్ ప్రయాణీకులు పామును గుర్తించారు. ఈ పామును చూసిన ప్రయాణీకులు భయబ్రాంతులకు గురయ్యారు. ల్యాండ్ అయ్యే సమయంలో ఈ పాము కన్పించింది. ప్రయాణీకుల కేకలు విన్న సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని పామును పట్టుకుని అడవిలోకి వదిలేశారు. ఈ పామును కామన్ గ్రేటర్ స్నేక్‌గా పిలుస్తారు. ఇది ఫ్లోరిడాలో ఎక్కువగా కనిపిస్తుంది. విషం ఉండదని, మనుషులపై దాడికి ప్రయత్నించదని వన్యప్రాణి నిపుణులు వెల్లడించారు. ఇలా విమానాలలో పాములు కనిపించడం మొదటిసారేం కాదు.  ఈమధ్యే మలేషియాలోని ఎయిర్ ఏషియా విమానంలో ప్రయాణీకుడిపై ఉన్న లైట్లులో పాము కనిపించింది. అప్పట్లో దీనిపై టిక్ టాక్ కూడా వచ్చింది.