ప్రాణం కాపాడిన స్మార్ట్ వాచ్
UK కు చెందిన డెవిడ్‌కు అతని భార్య స్మార్ట్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ స్మార్ట్ వాచ్‌లో పల్స్ రేటును చెక్ చేసుకునే సదుపాయం ఉంది. అతను దానిని ధరించిన వెంటనే పల్స్ రేటు 30గా చూపించింది. దీంతో ఆ వాచ్ పనిచేయడం లేదనే ఉద్దేశంతో భార్యకు చూపించగా..అనుమానం వచ్చిన భార్య వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేయంచగా గుండెలో పలు బ్లాక్స్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. దీంతో అతనిని 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచగా..138 సార్లు పది సెకెండ్ల పాటు గుండె పనిచేయడం అగిపోయినట్టు గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి బ్లాక్స్ తొలగించి వైద్యులు ప్రాణాలు కాపాడారు.