Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsTrending Todayviral

మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట

వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి మద్యం కేసులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి 11వ తేదీన సరెండర్ కావాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది. అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్ రెడ్డి పేరును ఏ4గా చేర్చింది. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జూలై 19వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారాయన. అయితే సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం అదేరోజు రాత్రి సిట్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో.. కోర్టుల్లో ఉపశమనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఓటేయాల్సిన అవసరం ఉందని అందులో పేరొన్నారాయన. అయితే ఈ పిటిషన్ కు అర్హత లేదంటూ సిట్ వాదించినా.. వారి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఎంపీగా మిథున్ రెడ్డి ఓటేయాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ.. మధ్యంతర బెయిల్ జారీ చేసింది.