మంత్రి గంగులకు షాక్.. ఐటీ, ఈడీ సోదాలు
తెలంగాణ వ్యాప్తంగా గ్రానైట్ వ్యాపారుల ఇళ్లపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయ్. గ్రానైట్ వ్యాపారులు ఫారెన్ ఎక్స్చెంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా నిబంధనలను అతిక్రమించారన్న ఆరోపణలపై ఈడీ, ఐటీ రంగ ప్రవేశం చేశాయి. అక్రమాలు గుర్తించిన 8 కంపెనీలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. తాజాగా తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంబంధించిన కార్యాలయాలపై తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నివాసంతోపాటు, మంకమ్మతోటలో ఆయనకు సంబంధించిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతాల్లో ఉన్న మహావీర్ గ్రానైట్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.