గేమ్ ఛేంజర్ మూవీకి షాక్
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ మూవీ ఈ రోజే రిలీజయిన సంగతి తెలిసిందే. స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో, నిర్మాత దిల్ రాజు రూ.450 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి విడుదల రోజే భారీ షాక్ తగిలింది. ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే హెచ్‌డీ ప్రింట్‌తో అందుబాటులోకి వచ్చింది. పైరసీ ఈ చిత్రాన్ని వెంటాడింది . దీనితో అభిమానులు హార్ట్ బ్రేకింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. అయితే పైరసీని ప్రోత్సహించకూడదని థియేటర్‌లోనే ఈ చిత్రాన్ని చూడాలంటూ మూవీ టీమ్ పేర్కొంది.