InternationalNews

విమాన ప్రయాణికులకు షాక్

ఎయిర్ ఇండియా కంపెనీ విమాన ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. నవంబర్, డిసెంబర్‌లో అమెరికా వెళ్లవలసిన 60 విమానాలను రద్దు చేసింది. ఆ రోజులలో అమెరికా ప్రయాణాన్ని బుక్ చేసుకున్న ప్రయాణికులకు డేట్ మార్చుకునే అవకాశం ఇవ్వడం, లేదా టికెట్ డబ్బులు రిటర్న్ చేసే సదుపాయం కూడా కల్పించింది. నిర్వహణ సమస్యల కారణంగా విమానాలకు మరమ్మతు పనులు చేయాలని, విమానాలు అందుబాటులో లేవని పేర్కొంది. ఈ తేదీలలో రద్దయిన విమానాలలో శాన్ ఫ్రాన్సిస్‌కో, చికాగో విమానాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. సాంకేతిక సమస్యలు, ఇతర మెయిన్‌టెనెన్స్ సమస్యల కారణంగా విమానాలు అందబాటులో లేవని, ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై విచారం వ్యక్తం చేసింది. ఈ విమానాలలో ఢిల్లీ- వాషింగ్టన్, ఢిల్లీ- చికాగో, ముంబయ్- శాన్‌ఫ్రాన్సిస్‌కో వెళ్లే విమానాలున్నాయి.