దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. ఏడు రాష్ట్రాల్లో 13 స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 13 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు 11 చోట్ల ఆధిక్యంలో ఉంటే, 2 స్థానాల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. బీహార్ రూపౌలీ స్థానంలో జేడీయూ ఆధిక్యంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లోని హామిర్‌పూర్ స్థానంలో బీజేపీ లీడ్‌లో ఉంది. ఇక హిమాచల్ దేరా, నలగఢ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అనూహ్యంగా మధ్యప్రదేశ్ అమర్‌వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, పంజాబ్ జలంధర్ వెస్ట్‌లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు విక్రవండీలో డీఎంకే ఆధిక్యంలో ఉండగా, ఉత్తరాఖండ్ బద్రినాథ్, మంగలూర్‌లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. పశ్చిమబెంగాల్ రాయ్‌గంజ్‌లో, రాణాగఢ్ దక్షిణ్, బాగ్డా, మణిక్‌తాలాలో తృణముల్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
https://results.eci.gov.in/AcResultByeJuly24/index.htm

 
							 
							