Home Page SliderInternational

సౌత్‌కొరియాలో సూసైడ్ చేసుకున్న రోబో

సౌత్ కొరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.కాగా ఓ ఆఫీస్‌లో సేవలందించే రోబోట్ దానంతట అదే మెట్లపై నుంచి దూకినట్లు తెలుస్తోంది. అయితే దానికి ముందు ఆ రోబోట్ అయోమయంగా తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో రోబో ఆత్మహత్య చేసుకుందని అధికారులు వెల్లడించారు. కాగా ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. అయితే రోబో ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు రోబో ముక్కలను కంపెనీకి పంపినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రోబో ఆత్మహత్య చేసుకోవడం అసాధ్యమని పలువురు వాదనలు వినిపిస్తున్నారు.