Home Page SliderTelangana

అవినీతి BRS, కాంగ్రెస్‌ల కంటే నీతివంతమైన బీజేపీయే మేలు

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావుకు మద్దతుగా ఆదివారం సాయంత్రం జేపీ నడ్డా హాజరైన రోడ్ షో బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. గౌతంనగర్ డివిజన్ హనుమాన్‌పేట నుండి ఉత్తమ్‌నగర్ వరకు రోడ్ షోలో పాల్గొని స్థానికులకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. నడ్డా మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో అన్ని వర్గాల వారు సుఖసంతోషాలతో ఉన్నారని, తెలంగాణలో పాలన అవినీతిమయమైందని అన్నారు. కాంగ్రెస్‌కు స్థిరత్వం లేదని, ఆ పార్టీకి ఓటు వేయడం దండగన్నారు. అభ్యర్థి రామచంద్రరావు మాట్లాడుతూ ధన బలం, అంగబలం ఉన్నవారితో బీజేపీ పోటీ పడుతోందని, ప్రజలు ఆలోచించి ఓటువేసి తమ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఓబీసీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.