Home Page SliderTelangana

సమాచారమిస్తే రూ.2 లక్షలు బహుమానం

టిజి: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్ ఆదేశాలతో.. తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇస్తే మాత్రమే ఈ మొత్తాన్ని బహుమతిగా గెలుచుకునే అకాశం ఉంది. అందుకోసం 8712671111 నంబరుకు ఫోన్ చేసి సమాచారమివ్వాలి.