NationalNews Alert

ఒక్క రోజులో 4 లక్షల మంది విమానమెక్కారు..!

కోవిడ్ సృష్టించిన కల్లోలం నుండి దేశంలో ఒక్కో రంగం నెమ్మదిగా కోలుకుంటోంది. తాజాగా విమానయాన రంగం తిరిగి గాడిలో పడిందని, దేశవ్యాప్తంగా విమాన ప్రయాణీకుల సంఖ్య పెరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా  ట్వీట్ చేశారు. అక్టోబరు 9 వ తేదీన విమాన ప్రయాణీకుల సంఖ్య 4 లక్షలకు చేరిందని, ఇది కొవిడ్ ముందున్న స్థితికి చేరినట్లేనని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై ప్రధాని మోదీ రీట్వీట్ చేస్తూ ఇది  గొప్ప సంకేతమని , తమ ప్రభుత్వం, దేశంలో విమాన సేవల విస్తరణపై దృష్టి సారించినట్లు తెలియజేసారు. సులభతర జీవనానికి, ఆర్థిక పురోగతికి ఇది ఎంతో ముఖ్యమని  సంతోషం వ్యక్తం చేశారు.