Home Page SliderNational

ఒక్క రోజులో రెండున్నర కోట్ల ‘డౌన్‌లోడ్స్‌’తో రికార్డు

‘జియోయాప్’ ఒకే ఒక్కరోజులో రెండున్నర కోట్ల డౌన్‌లోడ్స్ కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ‘ఐపీఎల్’ మ్యాచ్ కారణంగా జియో సినిమా యాప్ డౌన్‌లోడ్ల పంట పండించింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు ఈ యాప్ అవకాశం ఇవ్వడంతో అందరూ పోటీలు పడి డౌన్‌లోడ్స్ చేసుకున్నారు. నిన్న మొదటి మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేసే సమయంలో రికార్డు స్థాయిలో వ్యూస్ 1.6 కోట్లు దాటింది. మొత్తానికి మ్యాచ్ వ్యూస్ 50 కోట్లు దాటిందని జియో తెలిపింది. ఇక ఐపీఎల్ పూర్తయ్యే సరికి ఎన్ని రికార్డులు బద్దలు అవుతాయో?