Home Page SliderNational

మంచూరియాలో ఎలుక.. పోలీసులు వచ్చేలోపే..

ముంబయి ఐరోలీలోని ఓ హోటల్ లో మంచూరియాలో చనిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునేందుకు 10 మంది మహిళలు ఐరోలీలోని పర్పుల్ బటర్ ఫ్లై అనే హోటల్‌కు వెళ్లారు. ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటుండగా ఓ మహిళ ప్లేట్‌లో చనిపోయిన ఎలుక కనిపించింది. అది పూర్తిగా ఉడికి గుర్తు పట్టలేనంతగా ఆహారంలో కలిసిపోయింది. పదాన్ని చూసిన మహిళలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సిబ్బందిని పిలిచి మహిళలు వాగ్వాదానికి దిగారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి హోటల్ కి పిలిచారు. అయితే.. పోలీసులకు అక్కడికి చేరే లోపే సిబ్బంది ఆ ప్లేట్‌ను మాయం చేసేశారు. హోటల్స్ వాళ్లు డబ్బులు సంపాదనే చూస్తున్నారు. కానీ.. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదని నెటిజన్లు ఘోరంగా మండిపడుతున్నారు.