ఛత్తీస్‌ఘడ్ ఘటనలో చనిపోయిన జవాన్లకు అరుదైన నివాళి- శవపేటిక మోసిన సీఎం
ఛత్తీస్‌ఘడ్‌లో నిన్నటి మావోయిస్టుల మందుపాతర ఘటనలో చనిపోయిన జవాన్ల మృతదేహాలకు సంస్కారాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. వారి కుటుంబసభ్యుల రోదనల మధ్య ఆయన వారికి ఘనంగా నివాళులు అర్పించారు. వారి శవపేటికను మోసారు. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మాటువేసి, మందుపాతర పేల్చిన ఘటనలో బుధవారం 10 మంది జవాన్లు మరణించారు. వారి భౌతికకాయాలను వాహనాలలో స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన వాహనం వరకు శవపేటిక మోసారు.