ఏపీకి చెందిన కేంద్రమంత్రికి అరుదైన పదవి
ఏపీకి చెందిన కేంద్ర విమానయానశాఖామంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన పదవి దక్కింది. ఆయనను ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఆసియా-ఫసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సుల్లో ఆయనను సింగపూర్ దేశం ప్రతిపాదించింది. దీనికి భూటాన్ బలపర్చగా, మిగిలిన సభ్యదేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. భారతదేశం తరపున దక్కిన ఈ గౌరవానికి చాలా ఆనందంగా ఉందన్నారు రామ్మోహన్ నాయుడు. ఈ పదవిని బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. సభ్యదేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేలా విమానాల మార్గాలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో కేంద్రమంత్రిగా ఎన్నికయ్యారు.

