రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాలలోకి వచ్చినా తనదైన టాలెంట్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. మగధీర్, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలలో రామ్ చరణ్ నటనకు ఫ్యాన్స్ జై కొట్టారు. ఆయన మైనపు బొమ్మ విగ్రహం లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మే 9న ఆవిష్కరించనున్నారు. రామ్‌చరణ్‌కు దక్కిన ఈ గౌరవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగా ఫ్యామిలీ అంతా లండన్‌లోనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్- ఉపాసన దంపతులు, కుమార్తె క్లీంకారా లండన్‌లో ప్రత్యక్షం అయ్యారు. వీరి ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు బొమ్మ విగ్రహాలని లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచుతారన్న విషయం మనందరికి తెలిసిందే. మే 9న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రదర్శించనున్నారు. ఇప్పుడు పెద్ది సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు రామ్‌చరణ్. ఈ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.