అనంతునికి అరుదైన ఉత్సవం..
కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం 270 సంవత్సరాల తర్వాత అరుదైన మహా కుంభాభిషేక వేడుకలకు సిద్ధమైంది. పురాతనమైన ఈ ఆలయం పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ నెల 8వ తేదీన జరిగే మహా కుంభాభిషేకం ముఖ్య ఉద్దేశం ఆలయ పవిత్రను ప్రతిష్టాపించడం, ఆధ్యాత్మిక శక్తిని బలోపేతం చేయడమే అని అధికారులు వివరించారు. ఇలాంటి పవిత్ర క్రతువులు 270 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. 2017లో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం ఆదేశాల మేరకు పునరుద్ధరణ పనులు జరిగాయి. ఆ తర్వాత కోవిడ్ పరిస్థితి కారణంగా అది పెద్దగా ముందుకు సాగలేదు తరువాత 2021 నుండి దశలవారీగా వివిధ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీనితో మహా కుంభాభిషేక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు.