BusinessHome Page SliderNationalNews Alert

అంబానీ వారసుడికి అరుదైన అవార్డు

భారత కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి అరుదైన అవార్డు లభించింది. జంతు రక్షణ కోసం  అనంత్ అంబానీ గతంలో ‘వంతారా’ అనే సంస్థను స్థాపించారు. కార్పొరేట్ విభాగంలో జంతు సంక్షేమంలో ‘ప్రాణి మిత్ర’ అనే జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును భారత ప్రభుత్వం మత్స్య, పశు సంవర్థక పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానం చేశారు. ఈ అవార్డు వచ్చిన సందర్భంగా వంతారా సంస్థ సీఈవో వివాన్ కరణి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంస్థను గుజరాత్ జామ్ నగర్‌లోని 3 వేల ఎకరాలలో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగుల సంరక్షణా కేంద్రంగా ఉంది. ఇక్కడ ప్రపంచస్థాయి పశువైద్య చికిత్స లభిస్తుంది. భవిష్యత్ తరాల కోసం జీవ వైవిద్యాన్ని కాపాడడానికి తాను అలుపెరగని కృషి చేస్తామని ఈ సందర్భంగా ‘వంతారా’ సీఈవో పేర్కొన్నారు.