Andhra PradeshHome Page Slider

ఆరా ఫౌండేషన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి నివేదన సభ

మద్దిరాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఆరా ఫౌండేషన్ చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఇవాళ ప్రగతి నివేదన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గౌరవ ప్రజాప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామి రెడ్డి, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఆరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మస్తాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను నేతలు అభినందించారు. సొంత ఊళ్లో ఆరా మస్తాన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆమోఘమని నేతలు అభినందించారు.