Home Page SliderNational

తెలుగు రచయితకు ప్రతిష్టాత్మక కేంద్రసాహిత్యపురస్కారం

రచయితలకు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన  కేంద్రసాహిత్యపురస్కారం తెలుగు రచయితను వరించింది. ప్రముఖ తెలుగు నవలా, కథా రచయిత తల్లావజ్జల పతంజలి శాస్త్రి ఈ ఏడాది పురస్కారానికి ఎన్నికయ్యారు. డిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డులో రబీంద్రభవన్‌లోని సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్ హాలులో ఈ అవార్డులను ప్రకటించారు. ఆయన రచించిన రామేశ్వరం కాకులు..మరికొన్ని కథలు అనే లఘు కథల పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. ఈ పుస్తకంలో రామేశ్వరం కాకులు అనే కథ నుండి రోహిణి అనే కథ వరకూ కొన్ని కథలు ఉన్నాయి. పిఠాపురంలో జన్మించిన పతంజలి శాస్త్రి తిరుపతి, ఒంగోలు కళాశాలలో విద్యనభ్యసించారు. అనంతరం పుణెలోని ప్రతిష్టాత్మక దక్కన్ కాలేజీ నుండి పురావస్తు శాస్త్రంలో డాక్టరేటు అందుకున్నారు. ఆయన రాజమండ్రిలో పర్యావరణ సెంటన్‌ను నిర్వహించారు. అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేసి, పదవీవిరమణ చేశారు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు వంటి పేరు పొందిన కధా సంపుటాలెన్నో రచించారు.