Home Page SliderNationalSports

సచిన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్  సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించనుంది. రేపు జరగబోయే బీసీసీఐ వార్షికోత్సవంలో సచిన్‌కు ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్ 2024’ పురస్కారం ఇచ్చి సన్మానించబోతున్నారు. ఈ పురస్కారం ఇవ్వబోయే 30 వ భారత క్రికెటర్‌గా ఆయన నిలుస్తున్నారు. నిరుడు రవిశాస్త్రి, ఫరూఖ్ ఇంజినీర్లకు ఈ అవార్డు లభించింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఘనమైన రికార్డులు సాధించిన సచిన్‌కు ఈ అవార్డు ప్రధానం చేయడం ఎంతో సంతోషమని, భారత క్రికెట్‌కు ఆయన అందించిన సేవలు అద్భుతమని వారు పేర్కొన్నారు. భారత్ నుండి 664 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్ సచిన్. ప్రపంచ చరిత్రలోనే ఆయన ఆరుసార్లు వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న క్రికెటర్‌గా నిలిచారు.