గచ్చిబౌలిలో నిండు గర్భిణి దారుణహత్య
తన భర్తపై ఆడపడుచు భర్త పెంచుకున్న కక్షకి ఓ నిండు గర్భిణి బలైంది. ఈ ఘటనలో నిండు గర్భిణిగా ఉన్న స్రవంతిని ఆమె ఆడపడుచు భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వేటకొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్రవంతి హస్పిటల్‌కు తరలించే క్రమంలో ప్రాణాలు విడిచింది. స్రవంతి భర్తను చంపాలని శ్రీరామకృష్ణ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో స్రవంతి భర్త వాళ్ల పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు. దీంతో అప్పటికే స్రవంతి భర్తపై విపరీతంగా కోపం పెంచుకున్న శ్రీరామకృష్ణ తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో నిండు గర్భిణిగా ఉన్న స్రవంతిపై దాడి చేసి హతమర్చాడు. దాడి సమయంలో స్రవంతి తప్పించుకోవటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.